సాఫ్ట్‌వేర్‌ లోపం వల్లే ‘విక్రం’ క్య్రాష్‌ ల్యాండింగ్‌

బెంగళూరు,నవంబర్‌ 17(జనంసాక్షి):చంద్రుడికి అత్యంత సవిూపంలోకి వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ చివరి నిమిషంలో విఫలం కావడానికి గల కారణాల అన్వేషణలో ఇస్రో పురోగతి సాధించినట్లు సమాచారం. సాఫ్ట్‌ వేర్‌ సమస్యతోనే విక్రమ్‌ ల్యాండింగ్‌ విఫలమైందని అంతర్గత నివేదికను స్పేస్‌ కమిషన్‌కు అందజేసింది. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యేలా చంద్రయాన్‌-2ను డిజైన్‌ చేశారు . కానీ, చంద్రుడి ఉపరితలానికి దాదాపు 500 విూటర్ల సవిూపం వరకు వెళ్లి కూలిపోయింది. చివరి నిమిషంలో ఈ ప్రమాదం జరుగుతుందని శాస్త్రవేత్తలు ఏమాత్రం అంచనా వేయలేకపోయారు . విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం తయారు చేసిన సాఫ్ట్వేరు పరీక్షిస్తున్న సమయంలో కూడా ఎటువంటి సమస్య తలెత్తలేదు.వాస్తవానికి విక్రమ్‌ ల్యాండర్‌ ఆర్బిటర్‌ నుంచి విడిపోయి దాదాపు 20 కిలోవిూటర్లు సురక్షింతంగా ప్రయాణించింది. ‘రఫ్‌ బ్రేకింగ్‌ దశ నుంచి ‘ఫైన్‌ బ్రేకింగ్‌ దశకు వచ్చినప్పుడు సమస్య మొదలైంది. దీనికి అమర్చిన బ్రా ల్లో ఒక దానిని మండించి సెకన్‌ కు 146 విూటర్లు ప్రయణించేలా నియంత్రించే క్రమంలో అదుపు తప్పింది. ఫలితంగా సెకను 750 విూటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొంది. ఫలితంగా విక్రమ్‌ ల్యాండర్‌, రోవర్‌ దెబ్బతిన్నాయి.ఈ వైఫల్యంపై లిక్విడ్‌ ప్రొపెల్టన్‌ సిస్టమ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ వి.నారాయణ నేతృత్వంలోని అంతర్గత కమిటీ అధ్యయనం చేసింది. ఈ కమిటీకి నాసా నుంచి కొంత సమాచారం లభించింది. వీటిపై చేసిన అధ్యయనం సాయంతో వచ్చే ఏడాది నవంబర్‌ లో జరగబోయే చంద్రయాన్‌-2కి సన్నద్ధమవుతారు .