సామాన్యులకు లోక్‌అదాలత్ ద్వారా సత్వరన్యాయం
– సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్
హైదరాబాద్,ఏప్రిల్ 9(జనంసాక్షి):
లోక్‌దాలత్‌లకు సవాళ్లు రెట్టింపవుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ అన్నారు. న్యా య సహాయం, న్యాయసేవల్లో లోక్‌అదాలత్‌లది కీలకపాత్ర అన్నారు. పేదలకు న్యాయసహాయం లభించేలా పునరం కితం కావాలని పిలుపునిచ్చారు. పునరంకితం కావడానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన అఖిలభారత న్యాయసేవాధి కార సంస్థ సదస్సును జస్టిస్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదలకు న్యాయస హాయానికి అనుభవం లేని వాళ్లు ఉన్నారనే అపోహ ఉంది.. అది వాస్తవం కాదన్నారు. సత్వర న్యాయం అందిం చే వేదిక లోక్‌అదాలత్ అని వివరించారు. దేశంలో న్యా యం కోసం పోరాడే పేదలు ఎందరో ఉన్నారని జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. వారికి సత్వర న్యాయం అందేలా చూడాలని పేర్కొన్నారు. అందు కోసం లీగల్ సర్వీసెస్ సేవ లను విస్తరించాలని కోరారు. న్యాయం కోసం పోరాడే వారికి న్యాయం జరగాలిన సూచించారు. పేదలకు న్యా యం అందేలా మనమందరం పునరంకితం కావాలని అన్నారు. మనం పునరంకితం కావడానికి లోక్‌అదాలత్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా 30 శాంతం మంది పేదరికంలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ సలహాలు, సేవ ల్లో లోక్ అదాలత్‌ల పాత్ర కీలకమని ఠాకూర్ వ్యాఖ్యానిం చారు. న్యాయ సహాయం, న్యాయ సేవల్లో లోక్‌అదాలత్‌లు కీలకపాత్ర అని వివరించారు. దేశంలోని వివిధ కోర్టుల్లో సుమారు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు.న్యాయసేవలు అందించడంలో సాంకేతిక పరిజ్ఞా నం కీలకంగా మారిందని వ్యాఖ్యానించారు. న్యాయ మూ ర్తుల నియామక పక్రియ వేగవంతం చేస్తున్నామన్నారు. ఎన్ జేఏసీ వివాదం వల్ల 160మంది న్యాయమూర్తుల నియా మకం ఆగిపోయిందన్నారు. ఇటీవలే 90 మంది న్యాయ మూర్తుల నియామక పక్రియ పూర్తి చేశామని వివరించారు. న్యాయమూర్తుల నియామక పక్రియ వేగంతం చేసేందుకు కేంద్రమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.
గిరిజన హక్కులు కాపాడాలి: జస్టిస్ దవే
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆర్.దవే మాట్లాడు తూ.. లోక్ అదాలత్‌ల ద్వారా సమస్యలు వేగంగా పరిష్కా మవుతున్నాయని తెలిపారు. గతేడాది లోక్‌అదాలత్‌లలో 62లక్షల పెండింగ్ కేసులు పరిష్కారమయ్యాయని వివరిం చారు. గిరిజనుల హక్కులు పరిరక్షించాలని ఈ సందర్భం గా సూచించారు.దేశంలో గిరిజనుల హక్కులను పరిరక్షిం చాల్సిన అవసరం ఉందని జస్టిస్దవే స్పష్టం చేశారు. లోక్‌అ దాలత్‌లో ప్రతీ సమస్యకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయని వివరించారు. సమాజానికి మరింత మేలు చేసే పథకాలను ఈ సదస్సులో రూపొందించాలని సూచించారు.
చట్టాలు తెలియని వారికి లోక్ అదాలతో మేలు:సదానందగౌడ
చట్టాలు, హక్కుల గురించి తెలియనివారికి లోక్ అదా లత్‌లు ఉపయోగపడతాయని కేంద్రనాయ్యశాఖ మం త్రి సదానందగౌడ అన్నారు. లోక్ అదాలత్‌లోని ఏడు పథకాలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు. లోక్ అదాలత్‌ల లక్ష్య సాధనకు మరింత కృషి చేయాలని కోరారు. న్యాయ సహాయం కావాల్సిన పేదలకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని, అన్ని స్థాయిల్లో లోక్ అదాలత్ నిర్వహించాలని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ అన్నారు. నిరుపేదలకు న్యాయం దక్కే చోటు లోక్ అదాలత్ అని, లోక్ అదాలత్ లక్ష్యసాధనకు మరింత కృషి జరగాలని అభిప్రాయపడ్డారు. లోక్ అదాలత్‌ల ద్వారా దేశ వ్యాప్తంగా 5.5లక్షల బ్యాంకు కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. లోక్ అదాలత్‌లో సహాయం పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. లోక్‌అదాలత్‌లో ప్రవేశపెట్టిన 7 పథకాలను వినియోగించుకోవాలని కోరారు. పారా లీగల్ వాలంటీర్లకు న్యాయ శిక్షణ ఇవ్వాలన్న లోక్‌అదాలత్ ఆలోచన సముచితమని పేర్కొన్నారు. న్యాయవాదుల నైపుణ్యం మెరుగుకోసం లోక్ అదాలత్ శిక్షణ ఇస్తుందని తెలిపారు. దేశంలో 1987 సంవత్సరంలో లోక్‌అదాలత్ చట్టాన్ని రూపొందించారని మంత్రి సదానంద గౌడ అన్నారు. లోక్‌అదాలత్‌లను అన్ని స్థాయిల్లో నిర్వహిం చాలని పేర్కొన్నారు. న్యాయ సహాయం కావాల్సిన పేదలకు లోక్‌అదాలత్‌లు ఎంతగానో ఉపయోగపడతా యన్నారు. చట్టాలు, హక్కుల గురించి తెలియని వారికి లోక్‌అదాలత్‌లు ఎంతగానో సహాయపడుతాయని తెలిపా రు. న్యాయవాదుల నైపుణ్యం పెంపునకు లోక్‌అదాల త్ శిక్ష ణ ఇస్తుందని వివరించారు. లోక్‌అదాలత్‌ల ద్వారా 5.5 ల క్షల బ్యాంకు కేసులు పరిష్కారమయ్యాయని స్పష్టం చేశారు.
లోక్ అదాలత్‌లతో పేదలకు సత్వర
న్యాయం : సిఎం కెసిఆర్
అనంతరం మాట్లాడిన కేసీఆర్ లోక్ అదాలత్‌లతో పేదలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. విూడియేషన్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. లోక్ అదాలత్‌లు మరింత సమర్ధవంతంగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. నిరుపేదలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లోక్‌అదా లత్ ఏర్పాటు చేశారని, ఎలాంటి ఖర్చు లేకుండా వాది, ప్రతివాదులకు న్యాయం దక్కే చోటు లోక్ అదాలత్ అని వివరించారు. లోక్ అదాలత్‌ల వల్ల న్యాయస్థానాల్లో కేసు లతో పాటు ఒత్తిడి తగ్గుతుందన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో శాశ్వత లోక్‌అదాలత్ భవనాలు నిర్మించాలనేది హైకోర్టు ఆలోచన. హైకోర్టు హైకోర్టు ఆలోచన ఆచరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. లోక్‌అదాలత్‌లతో సత్వర న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. లోక్‌అదాలత్‌లు న్యాయసాయం కావాల్సిన పేదల కు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఎలాం టి ఖర్చు లేకుండా వాది, ప్రతివాదులకు న్యాయం దక్కేచోటు లోక్‌అదాలత్ అని స్పష్టం చేశారు. లోక్‌అదాలత్‌ల వల్ల న్యాయస్థానాల్లో కేసులతోపాటు ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. హైకోర్టు ఆలోచన ఆచరణకు రాష్ట్ర ప్రభుత్వం సరియైనన్ని నిధులు కేటాయిస్తుందని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాలలో శాశ్వతప్రాతిపదికన లోక్‌అదాలత్‌లకు భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్బంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప విజన్, కమిట్‌మెంట్ ఉన్న నేత అని కొనియాడారు. అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సొంత రాష్ట్రంలో నిర్వహిస్తోన్న న్యాయసేవా సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. భాగ్యనగరం జాతీయ న్యాయ సదస్సుకు వేదికైంది. ఇవాళ నగరంలోని పార్క్ హయత్ ¬టల్‌లో 14వ జాతీయ న్యాయాధికారుల సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీ.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ధవే, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బొస్లేతోపాటు పలువురు న్యాయమూర్తులు ఈ సదస్సులో పాల్గొన్నారు.




