సాయంత్రం ఢీల్లీ వెళ్లనున్న సీఎం
హైదరాబాద్, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఈరోజు సాయంత్రి ఢీల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత్రి సోనియా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో సహా పలువురు హైకమాండ్ పెద్దల్ని కలిసే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల తొలగింపు, కేబినెట్ విస్తరణ అంశంపైనా ముఖ్యమంత్రి మంతనాలు జరపనున్నట్లు సమాచారం. అలాగే వ్యతిరేక వర్గీయుల కార్యకలపాలను రుజువులతో సహా సీఎం అధిష్టానం పెద్దలకు వివరించనున్నారు.