సాయి నగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు
వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 28(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగ సాయి పేట శ్రీ సాయి నగర్ కాలనీలో బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు సాంప్రదాయమైన బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా వేడుకలు నిర్వహించారు ఉత్సవాలను కూడా ఇదే ప్రాంతంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు