సాయుధపోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి..
టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 26 తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక, రజక సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు ఆమెకు ఘనంగా నివాళు లర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని అన్నారు. తమ హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి తో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్, భక్తుల వీరప్ప, నిమ్మ రమేష్, తిమ్మిగారి సుధాకర్,ఆగమనొల యాదయ్య, ఎల్లుపేట రాజు, సత్యనారాయణ, పోచయ్య, రమేష్, రామకిష్ణయ్య, మల్లేశం, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.