సాయుధ తెలంగాణ యోధుడు చెన్నమనేని ఇకలేరు

C

– ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక

– సీఎం కేసీఆర్‌,  సోదురుడు మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తదితరుల ఘననివాళి

– ప్రభుత్వ లాంఛనాలతో నేడు ఫిలింనగర్‌లో అంత్యక్రియలు

హైదరాబాద్‌,మే9(జనంసాక్షి): కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు, తొలితరం కమ్యూనిస్ట్‌ నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, ప్రముఖ స్వాతంత్య సమరయోధుడు అయిన సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరరావు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు సోమాజీగూడ యశద ఆసుపత్రిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కమ్యూనిస్ట్‌ ఉద్యమంతోనే జీవితాన్ని ముడివేసుకున్న చెన్నమనేని చివరి దశలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్‌ఒనేందుకు టిఆర్‌ఎస్‌లో చేరారు. చెన్నమనేని రాజేశ్వరరావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేశ్వరరావు స్వస్థలం కరీంనగర్‌ జిల్లా వేములవాడ మండలం మారపాక. ఆయన సిరిసిల్ల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజీలేని రాజకీయ జీవితాన్న్ని గడిపిన యోధుడు. పాతతరం కమ్యూనిస్టు నాయకుల్లో చెన్నమనేని రాజేశ్వరరావు త్యంత సీనియర్‌ నాయకులు. ప్రజల తరపున పోరాడిన మహానేత చెన్నమనేని. జీవితం మొత్తం కమ్యూనిస్ట్‌ పార్టీకి, ప్రజలకే అంకితం చేశారు. చెన్నమనేని అభ్యుదయ భావాలతో పెరిగారు. స్కాలర్స్‌ డిబెట్‌ అనే విద్యార్థి సంఘం కార్యదర్శిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. రైతు సంఘం

నాయకుడిగా అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ సంస్థాన విమోచనోద్యమంలో చెన్నమనేని పాల్గొన్నారు. 1957లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా సేవలందించారు. సీపీఐ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. అనంతరం 1999లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2004 తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌ శాసనసభలో ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులకు చెన్నమనేని సన్నిహితుడు. విద్యార్థి దశ నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం వ్యతిరేక పోరాటంలో జైలు జీవితం అనుభవించారు. మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు, ఆర్థిక నిపుణులు చెన్నమనేని హన్మంతరావు స్వయాన ఆయనకు సోదరులు. వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ రాజేశ్వరరావు కుమారుడు. చెన్నమనేని రాజేశ్వరావు తెలంగాణ స్వతంత్ర సమరయోధుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎందరో తెలంగాణ సాయుధ పోరాట వీరులను గుర్తించి వారికి పెన్షన్లు ఇప్పించారు.  ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచారు. . తెలంగాణ స్వాతంత్య సమరయోధుల సంఘం అధ్యక్షుడిగా, సీపీఐ అనుబంధ సంస్థ రైతు సంఘం జాతీయ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.. రాజేశ్వరరావు అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

సిఎం కెసిఆర్‌ తదితరుల నివాళి

చెన్నమనేనికి సిఎం కెసిఆర్‌, విద్యాసాగర్‌ రావుల నివాళి

చెన్నమనేని రాజేశ్వరరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రాజేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అసమాన పోరాట యోధుడని అన్నారు. రాజేశ్వరరావు భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లో ఆయన నివాసానికి వెల్లి నివాళి అర్పించారు. ఆయనవెంట మంత్రులు పలువురు వచ్చి నివాళి అర్పించారు. చెన్నమనేని నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ ఆయన పార్థివదేహం వద్ద పుష్ప గుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. చెన్నమనేని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చెన్నమనేని ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఎంపీ వినోద్‌, మంత్రి జోగు రామన్నతోపాటు పలువురు సీఎం వెంట ఉన్నారు. చెెన్నమనేని మృతి పట్ల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సంతాపం తెలిపారు. చెన్నమనేని కుటుంబాన్ని కరీంనగర్‌ లోక్‌సభ సభ్యులు వినోద్‌ కుమార్‌ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.  రాజేశ్వరరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  ఎపి సిఎం చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ తదితరులు ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. చెన్నమనేని రాజేశ్వరరావు మృతి పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భాంతి  వ్యక్తం చేశారు. చెన్నమనేనీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విలువలకు కట్టుబడిన వ్యక్తి చెన్నమనేని అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. పిసిస చీఫ్‌ ఉత్తమ్‌,సిఎల్పీ నాయకుడు జానా రెడ్డి తదితరులు నివాళి అరన్పించారు.తనసోదరుడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధపోరాట ధీరుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు భౌతికకాయానికి మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు నివాళులర్పించారు.  రాజేశ్వర్‌రావు నివాసానికి వెళ్లి రాజేశ్వర్‌రావు పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. రాజేశ్వర్‌రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. రాజేశ్వర్‌రావులో సిద్దాంతపరమైన ఆలోచనలు ఎన్నో ఉన్నాయన్నారు. ఆయన జీవితంలో ఎన్నో సంఘర్షణలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజేశ్వర్‌రావు పోరాట ధీరుడిగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఎన్నిఉన్నా సంపూర్ణ జీవతాన్ని సార్థకం చేసుకున్నారని అన్నారు. జీవితంలో ఎత్తుపల్లాలను చూసిన ఆయన నిండుజీవితాన్ని ఆస్వాదించారని అన్నారు. ఆయన జీవితం తమకు ఆదర్శ ప్రాయమని అన్నారు. ఇదిలావుంటే మంగళవారం ఫిలింనగర్‌ మహాప్రస్థానంలో చెన్నమనేని భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని  రాజేశ్వరరావు(93) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. చెన్నమనేని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన స్వస్థలం వేములవాడ మండలం మారుపాక గ్రామం. రాజేశ్వరరావు కుమారుడు రమేష్‌ ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు రాజేశ్వరరావు సోదరుడు.సీపీఐలో సుదీర్ఘకాలం పనిచేసిన చెన్నమనేని రాజేశ్వరరావు 1999లో టీడీపీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు.విద్యార్థి దశ నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం వ్యతిరేక పోరాటంలో జైలు జీవితం అనుభవించారు. మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు, ఆర్థిక నిపుణులు చెన్నమనేని హన్మంతరావు ఆయనకు సోదరులు. వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ రాజేశ్వరరావు కుమారుడు. చెన్నమనేని రాజేశ్వరావు తెలంగాణ స్వతంత్ర సమరయోధుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.