సార్వత్రిక డిగ్రీలో ప్రవేశాలు ప్రారంభం
ఖమ్మం, నవంబర్ 8 బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ఖమ్మం అధ్యయన కేంద్రం సహాయ సంచాలకులు రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలకు ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. తర్వాత ప్రవేశాలకు 500 రూపాయల అపరాధ రుసుము చెల్లించాలన్నారు.