సార్వత్రిక సమ్మెతో స్తంభించిన భారత్‌

నోయిడాలో ఉద్రిక్తత
నేడూ కొనసాగింపు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) :
సార్వత్రిక సమ్మెతో భారత్‌ స్తంభించింది. బ్యాంకులు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డెక్కి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సింగరేణిలో ఉత్పత్తి నిలిచిపోయింది. దేవవ్యాప్తంగా కార్మికులు నిరసన చేపట్టారు. యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ఆర్థిక సంస్కరణలకు నిరసనగా 11 కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఎనిమిది లక్షలకు పైగా బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది.రాష్ట్రంలో అర్ధరాత్రి నుంచే సమ్మె ప్రభావం మొదలైంది. 12 గంటల నుంచే ఆటోలు నిలిచిపోయాయి. మరోవైపు సార్వత్రిక సమ్మెకు 108 ఉద్యోగులు దూరంగా వుండాలని సర్కార్‌ ఆదేశించింది. సమ్మెలో పాల్గొంటే వారిపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించింది. సమ్మెకు విపక్ష టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపాయి. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ చేపట్టిన చలో సచివాలయ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి సచివాలయం వరకూ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు సచివాలయం వైపు దూసుకువెళ్లేందుకు యత్నించడంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి సమీప పోలీసుస్టేషన్‌కు తరలించారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. పలు రాష్టాల్ల్రో బ్యాంకింగ్‌, తపాలా, రవాణా, విద్య, వైద్య సేవలపై సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్‌, తపాల సేవలు స్తంభించిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశరాజధాని న్యూఢిల్లీలో ఆటోలు, రిక్షాల కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనడంతో రవాణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు వేలకు పైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముంబయిలో బ్యాంక్‌ సేవలు నిలిచిపోగా బస్సులు, రైళ్లు యథావిధిగా తిరిగాయి. ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే ‘నో వర్క్‌, నో పే’ విధానాన్ని అమలు చేస్తామని కేరళ, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు హెచ్చరించాయి. అయితే ప్రభుత్వ హెచ్చరికలను