సార్‌..జోహార్‌

C
ప్రొఫెసర్‌ జయశంకర్‌కు తెలంగాణ ఘననివాళి

భవన్‌లో కేసీఆర్‌ పుష్పాంజలి

హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్‌ జయంతి కార్యక్రమం రాషట్‌రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన సేవలనుఏ, నిస్వార్తతను పలు వురు కొనియాడారు. తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జయశంకర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్‌ సేవలను కొనియాడారు.తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్‌ సేవలను స్మరించుకున్నారు.  సీఎంతో పా టు పలువురు  మంత్రులు,నేతలు జయశంకర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సచివాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ఉద్యోగులు పుష్పాంజలి ఘటించారు. సచివాలయం లో జయశంకర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా జయశంకర్‌ చిత్రపటానికి సీఎస్‌ రాజీవ్‌శర్మ నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు నివాళులర్పిం చారు. జయశంకర్‌ జయంతి వేడుకలను జరపడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జయశంకర్‌ సేవలు మరువలేనివని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నేతలు ప్రతినబూ నారు. తెలంగాణ అసెంబ్లీ హాలులో ఆచార్య జయశంకర్‌ జ యంతి వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జయ శంకర్‌తో తమకు గల అనుబంధాన్ని, ఆయన సేవలను స్మరిం చుకున్నారు.  తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  నాంపల్లిలోని ఐకాస కార్యాలయంలో ఆచార్య జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలం గాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌, ఐకాస నేతలు జయ శంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రొపె ˜సర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో జయశంకర్‌ సార్‌ 82వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆచార్య జయశంకర్‌ సార్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడొద్దన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని ఉద్ఘాటించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అది అభివృద్ది చెందుఉతన్న తరుణంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ మరణించడం తీరని లోటని పలువురు టిఆర్‌ఎస్‌ ఎంపిలు అభిప్రాయపడ్డారు. సామాన్యుడిలో కూడా ఉద్యమ స్థెర్యాన్ని నింపిన వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ అని తెలంగాణ ఎంపీలు, ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. జయశంకర్‌సార్‌ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన నిరంతరం తెలంగాణ కోసం తపించి అమరుడయ్యాడని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు  ప్రముఖులు జయశంకర్‌ పోరాట స్ఫూర్తిని కొనియాడారు.  జయశంకర్‌ ఆశయాలను అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారన్నారు. జయశంకర్‌ స్ఫూర్తితో తెలంగాణ సాధించు కున్నామన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ అడుగులు వేస్తోందని అన్నారు. ఏదైతే తెలంగాణ కోరుకున్నారో అదే ఇప్పుడు సాకారమయ్యిందన్నారు.  తెలంగాణ అంటేనే భయపడే రోజు నుంచి జయశంకర్‌సార్‌ ఉద్యమాన్ని నడిపించారు. ప్రొఫెసర్‌గానే కాదు..ఉద్యమనేతగా జయశంకర్‌ సార్‌కి మంచిపేరుంది. సామాన్యుడిలో కూడా ఉద్యమ స్థయిర్యాన్ని నింపారు. సార్‌కు నిజమైన నివాళిఅంటే ఆయన ఆశయాలను విజయవంతంగా కొనసాగించడమే. జయశంకర్‌సార్‌ తర్వాత సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఆకాంక్షను బలంగా నడిపించి రాష్ట్రాన్ని సాధించారు. బంగారు తెలంగాణ సాధనకై సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నరు. జయశంకర్‌ సార్‌ శిష్యుడిగా ఆకాంక్షను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నరని పేర్కొన్నారు.