సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులు:

 

 

 

 

 

విద్యుత్ బిసి సంఘం మారం శ్రీనివాస్. . .
మిర్యాలగూడ, జనం సాక్షి

మిర్యాలగూడ విద్యుత్ శాఖ డివిజనల్ ఆఫీసు ఆవరణలో ధృవతార సావిత్రీబాయి ఫూలే 126వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విద్యుత్ బిసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, నల్గొండ జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్, డివిజనల్ ఇంజనీర్ అయితబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలనీ,
స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. స్త్రీ, పురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు అని పేర్కొనడం జరిగిందన్నారు.
మహిళలకు విద్య, ఉద్యోగ, చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారానే అభ్యున్నతి సాధ్యమవుతుంద న్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, అధికారులు జ్యోతి కుమార్, బీసం దాసయ్య, ఎల్.వి సత్యనారాయణ, పాలడుగు వెంకటేశం, హడావత్ బాలు, ఎం నిఖిత, ఉదయ్ కుమార్, ఉద్యోగులు కోట జాన్, బచ్చు రామ్ చందర్, హరికిషన్, కృష్ణారెడ్డి, పాండురంగ, బాబురావు, క్రాంతి కుమారి, శివరామకృష్ణ, తోట వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, నాగమణి, పి వెంకటేశ్వర్లు సురేష్, భాస్కర్, నరసింహ, శ్రీకాంత్, కృష్ణారెడ్డి, విజయ శేఖర్, తాజోద్దీన్, సంతోష్, ఇమ్రాన్ ఖాన్, రషీద్ భాయ్, రామ్మూర్తి, ఇక్బాల్, శ్రీనయ్య, బిక్షం, సురేష్, నాగమణి, ఝాన్సీ, పద్మ, అంజు ఫాతిమా, సుగుణమ్మ, అనసూర్య, ప్రమీల, జరీనా, భార్గవి, ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు.