సింగరేణికి ఊపిరి పోసిందే టిఆర్‌ఎస్
అనేక సమస్యలను పరిష్కరించా: పుట్టా మధు
మంథని,డిసెంబర్1(జనంసాక్షి): నాడు స్వరాష్ట్రం కోసం కేసీఆర్ పోరాడి వస్తే.. సింగరేణి కార్మికులు ఊపిరి అందించి రాష్ట్ర సాధనలో ఆయనకు అండగా నిలిచారని, అలాంటి విూకు ఎంత చేసినా తక్కువే అని
మంథని టీఆర్‌ఎస్ పుట్ట మధు పేర్కొన్నారు. సింగరేణిపై కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉండడంతోనే సంస్థను అభివృద్ధిలోకి తీసుకవచ్చారని వివరించారు. గనులపై కార్మికులకు నాణ్యమైన అల్పాహారం అందించాలని క్యాంటీన్లను ఆధునీకరించారని తెలిపారు. జాతీయ సంఘాలు కార్మికుల వద్ద నుంచి చందాలు వసూలు చేస్తున్న ఆనవాయితీ ఉంటే.. మరి సింగరేణిలో టీబీజీకేఎస్ గెలవగానే కార్మికులు గుర్తింపు సంఘానికి చందా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెసోళ్లు నమ్మించి గొంతుకోస్తరనీ, అది ఆ పార్టీ నైజమని పుట్ట మధు అన్నారు. సింగరేణి ప్రభావిత గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాగ్రామాల ప్రజలు పుట్ట మధుకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు, ప్రజలు పెద్దఎత్తున మంగళహారతులు, పూల దండలు, కోలాట బృందాలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. గ్రామాల్లోని ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి మరోమారు ఆశీర్వదించాలని కోరారు.కాంగ్రెస్ నాయకులు ఏనాడు సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలను పరిష్కరించలేదని, అందువల్లే వారి సమస్యలు జఠిలమయ్యాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించానని గుర్తు చేశారు. మరోమారు అవకాశం ఇస్తే సింగరేణి సమస్యలు ఒక్కటి కూడా ఉండకుండా చూస్తానని హావిూ ఇచ్చారు.