‘సింగరేణిలో పూర్వ వైభవాన్ని తెస్తాం…’
– హెచ్‌ఎంఎస్ నేత రియాజ్
గోదావరిఖని, జూన్ 9, (జనం సాక్షి)
సింగరేణిలో పూర్వ వైభవాన్ని నెలకొల్పడానికి కృషి జరుపుతామని… సింగరేణి మైన్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్(హెచ్‌ఎంఎస్) ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ హామీ ఇచ్చారు. జిడికే-7ఎల్‌ఈపిలో శనివారం ద్వారసమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి కార్మికుల హక్కులను గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు పోగొట్టయన్నారు. ఈ సంఘాలకు ఓటడిగే నైతిక హక్కులేదన్నారు. వారసత్వ ఉద్యోగాలను తిరిగి తేవడంలో తమ సంఘం కృషి జరుపుతుందన్నారు. 6నెలల్లోగా గత వైభవాన్ని నెలకొల్పుతామని రియాజ్ హామీ ఇచ్చారు. ఈ ద్వారసమావేశంలో నాయకులు యాదగిరి సత్తయ్య, ఆర్.కేశవరెడ్డి, ప్రతాపరావు, ఎరుకల రాజమల్లు, ఆమంచ గౌతం, హబీబ్ బేగ్, రామస్వామి, పెరుమాండ్లు, రాజేశ్వర్‌రావు, బుద్దారెడ్డి, వెంకటస్వామి, హనుమండ్లు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.