సింగరేణి కార్మికులకు రూ.68,500 బోనస్‌..

దీపావళికి భారీ బోనస్‌ ప్రకటించిన యాజమాన్యం

హైదరాబాద్‌,నవంబర్‌7( జనం సాక్షి ): సింగరేణి కార్మికులకు తీపి కబురు అందించింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌ ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా ప్రతి ఏడాది బోనస్‌ ఇస్తున్న సింగరేణి యాజమాన్యం ఈ ఏడాది దీపావళికి ముందే కార్మికులకు బోనస్‌ చెల్లించనున్నట్లు ప్రకటించింది.

ఒకప్పుడు నష్టాల బాటలో పయనించిన సింగరేణి, మూసివేత పరిస్థితికి చేరువైన సింగరేణి ఇప్పుడు లాభాలలో దూసుకుపోతోంది. కోల్‌ ఇండియా కంటే అత్యధిక లాభాలను సింగరేణి తన ఖాతాలో వేసుకుంటుంది. 2018 /-ఖ19 సంవత్సరంలో సింగరేణి సంస్థ 1765 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇక సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించిన కార్మికుల విషయంలో కూడా సింగరేణి యాజమాన్యం చాలా పాజిటివ్‌ గా వ్యవహరిస్తోంది. లాభాల బాటలో సింగరేణి పరుగులు పెడుతున్న నేపధ్యంలోనే బోనస్ల బొనాంజా కొనసాగుతుంది.అంతే కాదు గతంలో ఇచ్చిన బోనస్‌ కంటే ఎక్కువగా భారీ బోనస్‌ ను కార్మికులకు అందించనుంది. ఏటా మాదిరే దీపావళి బోనస్‌తో ఈసారి సింగరేణి కార్మికులు పండుగ చేసుకోనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ బోనస్‌ను ఈ నెల 12న కార్మికులకు చెల్లించనున్నారు. సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈ నెల 12న దీపావళి బోనస్‌ను చెల్లించాలని నిర్ణయించినట్లు శనివారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఒప్పందం చేసుకున్న విధంగా రూ.68,500 బోనస్‌ చెల్లించనున్నట్లు అందులో వెల్లడించింది.

20192/-ఖ0 ఆర్థిక సంవత్సరంలో అండర్‌ గ్రౌండ్లో విధులు నిర్వహించిన వారు 190 మస్టర్లు, సర్ఫేస్‌లో పనిచేసే వారు 240 మస్టర్లు కచ్చితంగా పూర్తి చేసి ఉండాలని ఆ ఉత్తర్వుల్లో చెప్పింది. ఈ పీఆర్‌ఎస్‌ బోనస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, పదో వేజ్‌ బోర్డు కిందకు వచ్చిన వారికి వర్తిస్తుందని సింగరేణి యాజమాన్యం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.—–