సింగరేణి కాలరీన్ రికార్డు స్థాయిలో బోగ్గు ఉత్పత్తి
ఇల్లందు: 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 53.1 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలరీన్ రికార్డు సృష్టించాయి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని 50 బొగ్గు గనులు ఉత్పత్తి సాధనలో భాగస్వామ్యం పంచుకున్నాయి. ఖమ్మం జిల్లా ఇల్లందులోని 21 ఇంక్లైన్, జేకే5 ఓపెన్‌కాన్ట్, కోయగూడెం ఓపెన్‌కాస్టుల్లో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి జరిగింది. చరిత్రలోనే మొదటిసారిగా ఇక్కడ మొత్తం 50 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు.