సింగరేణి పక్షపాతిగా సిఎం కెసిఆర్
రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమకార్యక్రమాలు
గత ప్రభుత్వాలు సింగరేణిని విస్మరించాయి
ఓసిపి-3 లో ప్రచారం చేపట్టిన సోమారపు
గోదావరిఖని,డిసెంబర్1(జనంసాక్షి): సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల పక్షపాతిగా ఎప్పటికీ నిలిచిపోతారని టీఆర్‌ఎస్ రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం ఓసిపి-3లో ఆయన ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రత్యక్షంగా పరోక్షంగా చేరుతున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమకార్యక్రమాలతో ముందుకు వస్తామన్నారు. కార్మికుల కుటుంబాలకు సూపర్‌స్షెషాలిటీ వైద్య సదుపాయం అందుతుందని వివరించారు. డిసెంబర్7న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. గత 60 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఆసరా పింఛన్లు, వడ్డీలేని రుణాలు, రైతుబందు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లాంటి పథకాలు దేశంలోనే గొప్పగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి సంస్థను విస్మరిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరమే కార్మికుల సంక్షేమం, వారి హక్కుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగారని గుర్తుచేశారు. కారుణ్య నియమాకాలతో పాటు తెలంగాణ ఇంక్రిమెంట్ అమలు, కార్మికుల సొంతింటి కలను సాకారం చేయడానికి రూ.10లక్షల రుణంపై వడ్డీని చెల్లించడం, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించామని వివరించారు. ఇంత చేసినా సీఎం కేసీఆర్ కార్మికుల కోసం ఏవిూ చేయలేదని మహాకూటమి నాయకులు విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు. పొరపాటున సింగరేణి కార్మికులు మహాకూటమికి ఓటువేస్తే సింగరేణి కార్మికుల సంక్షేమం అధోగతే అవుతోందన్నారు. రామగుండం నియోజకవర్గంలో కొంతమంది సెంటిమెంట్ ద్వారా ఓట్లు పొందాలని చూస్తున్న వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. రామగుండం నుంచి తనను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత సింగరేణి కార్మికులపైనే ఉందని ఆయన ఉద్ఘాటించారు. నాడు సింగరేణి గనులపై కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావనీ, అసలు కార్మికులను పట్టించుకున్న పాపాన కూడా పోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కార్మికులకు గనులపై క్యాంటీన్లు, యూనిఫాంలు, క్వార్టర్లకు ఏసీల బిగింపుతో ఆత్మగౌరవం నింపారన్నారు. దిగిపోయిన కార్మికులకు సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో కార్మికులకు రూ.10లక్షల వడ్డీ లేని రుణాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ దవాఖానాలో మెరుగైన వైద్య సదుపాయాలుతోపాటు కారుణ్య నియామకాలు సాధించి సింగరేణి కార్మిక క్షేత్రం పురుడు పోసుకునేలా చేశారనాను. టీఆర్‌ఎస్ పార్టీతోనే సింగరేణి అభివృద్ధి సాధ్యమవుతుందనీ, స్వరాష్ట్ర ఉద్యమంలో కార్మికులు ఏవిధంగానైతే కేసీఆర్‌కు అండగా నిలిచారో అదే ఉద్యమ పంథాతో డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.