సింగరేణి బిడ్డల జయకేతనం

భూపాలపల్లి, మే 24, (జనంసాక్షి) :
శుక్రవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో సింగరేణి కార్మికుల పిల్లలు జయకేతనం ఎగురవేశారు. ప్రభుత్వం రాష్ట్రంలోనే మొదటిసారిగ ప్రవేశపెట్టిన గ్రేడింగ్‌ జీపీఏ పద్దతిద్వారా ఫలితాలను ప్రకటించడం ద్వారా విద్యార్థులు చాలా అవస్థలకు గురైనారు తాము సాధించిన మార్కులను తెలుసుకోలేకపోయామనే అసంతృప్తికి గురైనారు. భూపాలపల్లిలో ఎన్ని కార్పొరేటు పాఠశాలలు ఉన్నప్పటికీి వాటిని మించి వడుప్సాలోని ప్రైవేటు పాఠశాలలు మంచి ఫలితాలను సాధించాయి. తెలుగు మీడియంలో విశ్వశాంతి విద్యాలయానికి చెందిన నవీన్‌ , వెంకటేష్‌, సివిరామన్‌ పాఠశాలకు చెందిన స్వాతి, 10 పాయింట్లను సాధించారు. ఇంగ్లీష్‌ మీడియంలో తేజ హై స్కూల్‌కి చెందిన కె. మానస, సీవీ రామన్‌ పాఠశాలకు చెందిన సౌమ్యారాణి, మాంటిస్సోరి పాఠశాలకు చెందిన సఫోరా నైరిన్‌, కోటేష్‌, సేెయింట్‌పీటర్స్‌ పాఠశాలకు చెందిన సాహితి లకు 9.8 పాయింట్లు సాధించినట్లు భూపాలపల్లి ్గ వడుస్సా అధ్యక్షులు లట్ట రాజబాబు తెలిపారు. ఇంత అద్బుతమైన ఫలితాలను సాధించిన విద్యార్ధులందరికి ఆయా పాఠశాలల కరస్పాండెంట్‌లు వడుప్సా నాయకులు అభినందనలు తెలిపారు.

తాజావార్తలు