సింగరేణి భూగర్భగనుల్లోకి వెళ్లిన సీఎం
ఖమ్మం: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మణుగూరు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బయలుదేరి ప్రకాశం భూగర్భగనిని సందర్శించారు. అక్కడ కార్మికుల దుస్తులు ధరించి భూగర్భగనిలోకి వెళ్లారు. 600 మీటర్ల మ్యాస్‌రైడింగ్ ద్వారా లోపలికి వెళ్లి అక్కడ బొగ్గు తీసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి కార్మికులతో ముచ్చటించారు. అనంతరం సీఎం ఇల్లెందు అతిధిగృహంలో సింగరేణి కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తారు.