సింగరేణి భూ నిర్వాసిత గ్రామాల ఆర్అండ్ఆర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి – అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

 జనంసాక్షి, మంథని : మంథని నియోజక వర్గంలోని సింగరేణి భూ నిర్వాసిత గ్రామాల ఆర్అండ్ఆర్ సమస్యలు వెంటనే పరిష్క రించాలని మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో శనివారం సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై మంథని ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గళమెత్తారు. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామంలోని ఆర్అండ్ఆర్ మిస్సింగ్ అయిన చాలా దాదాపు 100 మంది కుటుంబాలకు ప్యాకేజీని ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. అడ్యాల, రచ్చపల్లి మాత్రమే ఆర్ అండ్ ఆర్, పాల్ట్స్ ఇచ్చారు.. కానీ సింగిరెడ్డి పల్లె గ్రామానికి ప్లాట్ ఇవ్వలేదని, ఎక్స్గ్రేషియా పరంగా ముందుకు వెళ్తున్నా.. సింగిరెడ్డిపల్లి, మంగళపల్లి, లద్నాపూర్, చందనా పూర్ ఎస్సీ కాలనీ, ఇతర సింగరేణి ప్రభావిత గ్రామాలలో ఎక్స్గ్రేషియా సైతం పూర్తి స్థాయిలో భూ నిర్వాసితులకు అందలేదన్నారు. రామగిరి మండలంలో సింగరేణికి సంబంధించిన భూ నిర్వాసిత గ్రామాలు చందనాపూర్, సింగిరెడ్డిపల్లి, పెద్దoపెట, మంగళపల్లి, జల్లారం, చందనాపూర్ ఎస్సీ కాలని లోని భూ నిర్వాసితుల ఆర్ఆండ్అర్ సమస్యలను వెంటనే పరిష్క రించాలని డిమాండ్ చేశారు. అలాగే రామగిరి మండలం లదునపూర్ గ్రామంలో 283 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని, ఆధారాలు ఉన్న వారికి వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, అనేక రోజులుగా భూ నిర్వాసితులు నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో లదునపూర్ గ్రామానికి మంత్రి హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ వచ్చిన సమయం లోనూ వారికి సమస్యలపై విన్నవించగా, పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి, భూ నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ఇవ్వాలని కోరారు. చందనాపూర్ ఎస్సీ కాలనీలో వరదలు వచ్చినప్పుడు కరెంటు తీయడం జరిగింది.. మానవ దృక్పథంతో కరెంటు ఇవ్వమ్మంటే కరెంటు ఇవ్వలేని పరిస్థితి అక్కడున్న సింగరేణి అధికారులది అని అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను ఎప్పుడు రెగ్యులర్ చేస్తారో తెలుపాలని, ఎండిఓ ఆపరేటర్స్ గా పని చేసేవాళ్లను సింగరేణి ఎంప్లాయిస్ గా ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం తెలియ జేయాలన్నారు.

తాజావార్తలు