సింగరేణి సూపర్‌ బజార్లకు రూ. 41.5 కోట్ల వ్యాపారం

ఖమ్మం, నవంబర్‌ 14 : నాణ్యమైన సరకులను అందించడమే లక్ష్యంగా పనిచేస్తు సింగరేణి ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న సింగరేణి సూపర్‌ బజారుకు ఈ సంవత్సరం 41.5 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించినట్టు సూపర్‌ బజార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణ తెలిపారు. లాభార్జనను పట్టించుకోకుండా సింగరేణి కార్మికుల కుటుంబాలకు నాణ్యమైన సరకులను అందించడమే ధ్యేయమని సూపర్‌ బజార్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గ్యాస్‌ సిలిండర్లపై రాయితీని ఎత్తివేయడం వల్ల 15కోట్ల రూపాయల అదనపు భారం సూపర్‌ బజార్‌పై పడుతుందన్నారు. అందువల్ల గ్యాస్‌ను పొదుపుగా వాడవలసిన బాధ్యత ఉందన్నారు. ప్రస్తుతం సూపర్‌ బజార్‌ పరిధిలో 134 మంది ఉద్యోగులు ఉన్నారని వారిలో 27 మందిని రెగ్యులర్‌ చేశామన్నారు.