సింగరేణి సోలార్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి-ఎస్ ఏ నబి, షేక్ యాకుబ్ షావలి వెల్లడి

 

ఇల్లందు జూలై 25 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి సోలార్ కార్మికుల జనరల్ బాడీ సమా వేశం, స్థానిక చండ్ర కృష్ణమూర్తి
మెమోరియల్ ట్రస్ట్ భవనంలో సిఐటియు, ఐఎఫ్టియు నాయకుల ఆధ్వర్యంలోఈ మంగళవారం రోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఏ నబి, షేక్ యాకుబ్ షావలి, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని మాట్లాడుతూ.. ఇల్లందు సింగరేణి సోలార్ ప్లాంట్ లో పనిచేస్తున్న
కార్మికులకు నామమాత్రపు వేతనాలు చెల్లిస్తున్నారన్నారు.
ఈ నామమాత్రపు వేతనాలకు వ్యతిరేకంగా గత రెండు సంవత్సరాల నుంచి సింగరేణి యాజమాన్యం, టెండర్ పొందిన బిహెచ్ఇఎల్ సోలారిస్ యాజమాన్యాలకు ఎన్నిసార్లు చెప్పినా కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని అన్నారు.
ది, 26జులై 23న, సిఐటియు, ఐఎఫ్ టి యు ఆధ్వర్యంలో సోలార్ కార్మికుల నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికులకు కనీస వేతనాలు కేటగిరీ వారీగాచెల్లించి చట్టబద్ధహక్కులు అమలుకు వెంటనే సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకోవాలని కోరారు. లేనియెడల నిరవధిక సమ్మె కార్మికుల సమస్యల పరిష్కారమయ్యే అంతవరకు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ రాజు, బాలు, ప్రేమ్ సింగ్,రమకృష్ణ,ఉపేందర్,శంకర్,
తదితరులు పాల్గొన్నారు.