సింధూకు జేజేలు

C

– దారిపొడవునా నీరాజనాలు

– అభినందించిన సీఎం కేసీఆర్‌

– మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తాం

– క్రీడా విధానాన్ని ప్రకటిస్తాం

హైదరాబాద్‌,ఆగస్టు 22(జనంసాక్షి):దేశ కీర్తిపతాకను రియో ఒలంపిక్స్‌/-లో ఘనంగా చాటిన షట్లర్‌ రజత పతక విజేత సపివి సింధును తెలంగాణ ప్రభుత్వం ఉచితరీతిన సన్మానించింది. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఆమెను ఘనంగా సత్కరించారు. శాలువా కప్పిన మంత్రులు మెమొంటోతో సత్కరించారు.   బేఠీపడావో బేటీ బచావో అంటూ ప్రధాని మోడీ ఇచ్చినపిలుపు ఎలా ఉన్నా మనదేశ  కీర్తిపతాకను  ఇద్దరు బేటీలు చాటారని  మంత్రి కెటి రామారావు అన్నారు. రియో ఒలంపిక్స్‌లో సిందు, సాక్షిమాలిక్‌లు మన పరువు నిలబెట్టారని అన్నారు. అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. ఒలింపిక్స్‌ పతకాలతో పీవీ సింధు, సాక్షిమాలిక్‌ దేశ కీర్తిని పెంచారని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. భారతదేశం గర్వించే మహిళగా సింధు నిలిచిందన్నారు. సింధు.. ఇక్కడ వరకు రావడానికి ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. రాబోయే ఒలింపిక్స్‌ల్లో తెలంగాణ నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనేలా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే స్పోర్ట్స్‌ పాలసీని తీసుకుని వస్తామన్నారు.  ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు, ఆమె కోచ్‌ గోపీచంద్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వించే పుత్రికగా సింధు నిలిచిందని కొనియాడారు. ఎన్నో త్యాగాల తర్వాతనే ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. భారత్‌ నుంచి సింధు లాంటి మరెంతో మంది ఛాంపియన్లు రావాలన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ అనేక కార్యక్రమాలు, పాలసీలతో దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా స్పోర్ట్స్‌ పాలసీని తీసుకువస్తాం. ప్రధాని మోడీ బేటీ బచావో.. బేటీ పడావో అని నినదించారు. కానీ ఈ రోజు ఒలింపిక్స్‌ జరిగిన తర్వాత చూస్తే ఆ బేటీలిద్దరూ ఒక సింధు, ఒక సాక్షి మాలిక్‌ మొత్తం భారతదేశాన్ని బచాయించిన మాట వాస్తవమన్నారు. ఈ ఇద్దరమ్మాయిలు ఈ రోజు భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచం ముందు నిలబెట్టారని ప్రశంసించారు. దేశ స్వాతంత్య వేడుకలు జరుపుకుంటున్న సమయంలో సింధు, సాక్షి మాలిక్‌ దేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేశారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కొనియాడారు. సింధు ఫైనల్లో పోటీ పడుతున్న సమయంలో దేశమంతా ఒక్కటై ఆ మ్యాచ్‌ను వీక్షించిందని గుర్తుచేశారు. సింధు ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ తీసుకురాకపోయినా.. దేశానికి ఆమే ఒక బంగారమని కొనియాడారు. సింధు వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం ద్వారా పీవీ సింధు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఒలింపిక్స్‌ పతకం సాధించిన సింధుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నజరానా.. క్రీడలపై ఆయనకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోందన్నారు. సింధును ఆసక్తిగా తీసుకుని నేటి యువతరం క్రీడల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని నలుదిశలా చాటాలని పిలుపునిచ్చారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు భారతదేశ, తెలంగాణ ప్రతిష్ఠను పెంచిందని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సింధును ఆదర్శంగా తీసుకుని క్రీడాకారులందరూ క్రీడల్లో రాణించాలని సూచించారు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత పీవీ సింధు, ఆమె కోచ్‌ గోపీచంద్‌లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. గచ్చిబౌలి మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు సింధు, గోపీచంద్‌కు శాలువా కప్పి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పలువురు ప్రముఖులు సింధుకు పుష్ఫగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. తనకు జరిగిన సన్మానంపైసింధు స్పందించారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించి, మరిన్ని పతకాలతో మళ్లీ విూ అందరి ముందుకు వస్తానని ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు తెలిపింది. రియోలో పతకం సాధించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన సింధు, ఆమె కోచ్‌ పుల్లెల గోపీచంద్‌లకు అపురూపమైన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి గచ్చిబౌలి స్టేడియానికి వచ్చేవరకు అడుగడుగునా పుష్పగుచ్ఛాలు, దండలతో వాళ్లను ముంచెత్తారు. అనంతరం స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. విూ అందరి మద్దతు, ఆశీర్వాదాల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇందుకు గాను మా గురువు గోపీచంద్‌కు చాలా థాంక్స్‌. మా తల్లిదండ్రులు కూడా నన్ను చాలా సపోర్ట్‌ చేశారు, మోటివేట్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్‌, కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు స్టేడియానికి ఇంతమంది వస్తారని ఏమాత్రం అనుకోలేదు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించి మళ్లీ విూ ముందుకు వస్తానని అనుకుంటున్నాను అన్నారు. తొలిసారి ఒలింపిక్స్‌ బరిలో దిగిన తాను పతకం తెస్తానని అనుకోలేదని… కానీ దేశం తనపై పెట్టుకున్న నమ్మకమే తనను నడిపించిందన్నారు. తనను అభిమానించి ప్రోత్సహించిన అందరికీ సింధు ధన్యవాదాలు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో మున్ముందు మరిన్ని పతకాలు సాధిస్తానని సింధు దీమా వ్యక్తం చేశారు. సింధు స్ఫూర్తితో మున్ముందు మరింతమంది మరిన్ని పతకాలను దేశానికి తీసుకురావాలని సింధు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ఇంత మంచి స్వాగతం ఏర్పాటుచేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌ కు కృతజ్ఞతలు అని తెలిపారు. స్పోర్టస్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు. విమానాశ్రయం నుంచి వస్తుంటే దారి పొడవునా చిన్నా పెద్దా అందరూ సాదరంగా స్వాగతం పలికారని, మాకు ఇన్ని రోజుల నుంచి మద్దతిచ్చిన విూకు, ప్రభుత్వానికి చాలా చాలా ధన్యావాదాలని అన్నారు. ఇక్కడకు వచ్చిన చాలామంది లాగే తాను కూడా 2000 సంవత్సరంలో కరణం మల్లేశ్వరి పతకం గెలిచినప్పుడు ఆమెను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. ఇప్పుడు ఉన్న పిల్లల్లో కూడా చాలామంది సింధును స్ఫూర్తిగా తీసుకుని మున్ముందు దేశానికి మరిన్ని పతకాలు తెస్తారని ఆశిస్తున్నానని అన్నారు. విూరు అందిస్తున్న సహకారం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. క్రీడల్లో కూడా మన రాష్ట్రం ముందు నిలుస్తుందని భావిస్తున్నానని తెలిపారు. అంతకు ముందు భారత కీర్తిపతాకను రియో ఒలంపిక్స్‌లో రెపరెపలాడించి హైదారాబద్‌ చేరుకున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధుకు హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పూలతో అభిమానుల ఆమెను ముంచెత్తారు. బొకేలతో నిలువెత్తు అభిమానం చాటుకున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో పాటు ప్రజలు పెద్ద  ఎత్తున హాజరై ఆమె కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం అందించారు.  రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన షట్లర్‌ పి.వి.సింధు స్వదేశానికి తిరిగివచ్చిన సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాగత ఏర్పాట్లు ఘనంగా చేశారు. పి.వి సింధు విమానాశ్రయం నుంచి అరాంఘర్‌ విూదుగా గచ్చిబౌలి స్టేడియానికి చేరుకునేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వెండికొండ పివి సింధును అభినందించేందుకు క్రీడాభిమానులు భారీగా తరలివచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సింధు విజయోత్సవయాత్ర అట్టహాసంగా సాగింది. దారి పొడవునా బాణ సంచాకాలుస్తూ… ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. జయ¬ సింధు అంటూ నినదించారు. అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ సింధు, కోచ్‌ గోపీచంద్‌ ముందుకు సాగారు. వీరివెంట వారి తల్లిదండ్రలు కూడా ఉన్నారు. విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు సింధుకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు సింధుకు పుష్పగుచ్ఛం అందజేసి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, ఆరాంఘర్‌ విూదుగా వూరేగింపు కొనసాగింది. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌లో వేలాది మంది విద్యార్థులు, కళాకారులు ప్రజలు,స్థానిక నేతలు అట్టహాసంగా స్వాగతించారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. బాణసంచా కాలుస్తూ జయ¬ సింధు అంటూ నినదించారు. దారిపొడవునా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఓపెన్‌టాప్‌ బస్సులో సింధు, గోపీచంద్‌లు దారి పొడవునా ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దారి పొడవునా భారీ భద్రత ఏర్పాటు చేసిన అధికారులు ఊరేగింపు సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. సింధుకు దారిపొడవునా  పూవులు చల్లుతూ కేరింతలు కొట్టారు. డోలు వాద్యాలతో విజయోత్సవం ముందుకు సాగింది. బంధువులు, క్రీడాకారులు, మంత్రులు, అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. సింధు, సింధు అంటూ నినాదాలు మిన్నంటాయి.  విద్యార్థులు ఆమె విజయోత్సవ ర్యాలీ వెళ్తోన్న రోడ్డుకు ఇరు వైపుల నిల్చుని సింధు స్వాగతం, వెల్‌కమ్‌ వెల్‌కమ్‌ సింధు వెల్‌కమ్‌ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. అనంతరం ఆమె విజయోత్సవ ర్యాలీగా ఆమె గచ్చిబౌలి స్టేడియంకు చేరుకోనున్నారు. అక్కడ ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు సన్మానం చేయనున్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లై ఓవర్‌ నుంచి సింధుపై పూల వర్షం కురిపించారు.

ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. సింధు ప్రయాణిస్తున్న బస్సుకు ముందు, వెనుకవైపున భారీ ఎత్తున అభిమానులు జాతీయ జెండాలు, బెలూన్లతో ద్విచక్రవాహనాలపై ముందుకు తీసుకెళుతున్నారు.మరోవైపు బ్యాడ్మింటన్‌ అకాడవిూలో ఉన్న కొంతమంది ఔత్సాహికులు సింధు ఊరేగింపుకు గుర్రపు బండి సిద్ధం చేశారు. రాజా మహారాజ స్టైల్లో గుర్రపు బండిని తయారు చేశారు. ఊరేగింపుకు మేలు జాతి గుర్రాలను కూడా తీసుకొచ్చారు. ఉదయం నుంచి ఈ బండిని పూర్తిస్థాయిలో అందంగా తీర్చిదిద్దారు. బండినితెలుపు రంగులో తీర్చిదిద్ది రోజాపూలతో అందంగా అలంకరించారు. సింధు మా అకాడవిూ నుంచి వెళ్లి విజయం సాధించడం గర్వించదగ్గ విషయమని ఔత్సాహికులు చెబుతున్నారు. కాగా గతంలోనూ సైనా నెహ్వాల్‌ గెలిచినప్పుడు ఇలాగే చేశాం.. అప్పుడు ర్యాలీ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది.. అందుకే మళ్లీ సింధుకు ఈ గుర్రపు బండి సిద్ధం చేశామని చెప్పారు.

ఇక సింధు విమనాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం చేరడానికి దాదాపు మూడుగంటలపైనే పట్టింది. రియో స్టార్‌ పీవీ సింధు రాక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూసారు. అభిమాన క్రీడా తారకు స్వాగతం పలికేందుకు స్టేడియంలో ఎదురు చూస్తూ ఆమె ఆటతీరును నెమరువేసుకున్నారు.  ఆమె స్టేడియంకు ఎప్పుడొస్తుందా, తమ స్పోర్ట్స్‌ స్టార్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు, ప్రజలు నిరీక్షించారు. ఓపెన్‌ టాప్‌ జీపులో రియో స్టార్‌ పీవీ సింధును సన్మానించేందుకు మంత్రులు గచ్చిబౌలి స్టేడియంకు చేరుకున్నారు.