సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తికి జైలు శిక్
హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుల ముందు గొప్పలు చెప్పుకునేందుకు సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకిన వ్యక్తికి కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న ముఖేష్ స్నేహితులతో కలిసి మే 22వ తేదీన నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లాడు. మద్యం మత్తులో సింహాన్ని సవాల్ చేస్తానంటూ స్నేహితుల ముందు బీరాలు పోతూ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అందులో ఉన్న ఆఫ్రికా సింహాలు రాధిక, కృష్ణను భయపెట్టాలని క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై ముఖ్షే స్నేహితులు అధికారులకు సమాచారం ఇచ్చారు. భార్యతో గొడవపడి: పూటుగా తాగి సింహాల బోనులోకి దూకింది ఇతడే జూ ఉద్యోగి పాపయ్య, ఇతర సిబ్బంది అతడిని బయటకు తీసుకు వచ్చారు. అనంతరం సహాయ క్యురెటర్ మురళీధర్ బహదుర్ పురా పోలీస్ స్టేషన్‌లో ముఖేష్ పైన ఫిర్యాదు చేశారు. అతడి పైన అనధికారిక అతిక్రమణతో పాటు వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండుకు తరలించారు. కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు అతనికి నాలుగు నెలల నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు.