సిఎం కెసిఆర్ పిలుపు మేరకు హరితహారం
పచ్చని తెలంగాణ కోసం మొక్కలు నాటుదాం
అటవీశాఖ మంత్రి జోగురామన్న పిలుపు
ఆదిలాబాద్,ఆగస్ట్2(జనం సాక్షి): తెలంగాణ హరతహారంగా మారడానికి సిఎం కెసిఆర్ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలను నాటాలని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. అడవులతోనే జీవజాతులకు మనుగడ ఉంటుందని అన్నారు. అడవులు అంతరించిపోకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భావితరాల మనుగడ కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంజనం సాక్షికార్యక్రమాన్ని చేపట్టారనీ,మూడేళ్లుగా విజయవంతంగా మొక్కలు నాటడంతో వర్షా లు సంవృద్ధిగా కురుస్తున్నాయని పేర్కొన్నారు.రాష్ట్ర సర్కారు చేపట్టిన హరితహారం కార్యక్రమంలోపాల్గొని ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత హరితహారానికి అధికారులు పటిష్టమైన ప్రణాళికలు తయారు చేశారు. ఈ సారి జిల్లా వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు అందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేశారు. 78 నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. తొలిరోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా లక్షా 16వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేసి అమలు చేశారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడం, మొక్కలు నాటేందుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో జిల్లాలో 15 రోజుల నుంచి వివిధ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. నాలుగో విడతలో భాగంగా వివిధ శాఖలు ఎక్కడ ఎలాంటి మొక్కలు నాటాలనే ముందుస్తు ప్రణాళికలు తయారు చేశారు. అటవీ, విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక్కో విద్యార్థికి 6 మొక్కలను పంపిణీ
చేయనున్నారు. విద్యార్థులు తమ ఇంటి పరిసరాల్లో మొ క్కలు పెట్టేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఇళ్లలో పెంచుకొనేందుకు బంగన్‌పల్లి, దసేరీ, హమాయత్ రకాలకు చెందిన 2 లక్షల మామిడి మొక్కలను కొనుగోలు చేసి అందిస్తున్నారు.. వీటితో పాటు మనుగ, చామంతి, పనస, మల్లె, గులాబీ, కరివేపాకు, పారిజాతం మొక్కలను ప్రజల ఇళ్లలో నాటుకొనేందుకు పంపిణీ చేస్తున్నారు. వీరితో పాటు రైతులు పొలాల గట్లు, భూముల్లో మలబార్ వేప, సీతాఫలం ఇతర మొక్కలు పెంచి ఉపాధి పొందేలా ఉపాధిహావిూ పథ కం
నుంచి అవసరమైన నిధులు మంజూరు చేయనున్నారు. గిరిజనుకు పంపిణీ చేసిన ఆర్‌వోఎఫ్‌ఆర్ భూ ముల్లో సైతం ఇప్ప, ఇతర పండ్ల మొక్కలను పెంచనున్నారు. గ్రామాల్లో సైతం ప్రజలు కోరుకున్న మొక్కలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ విడత లో అటవీ ప్రాంతాల్లో బల్క్ ప్లాంటేషన్‌ను ఎక్కువగా చేపట్టనున్నారు. వేప, ఎగిస, బిందునార, మారేడు, ఉసిరి, రావి, బిల్లుడు, తునికి, సీమచింత, మొర్రి, మేడి లాంటి పండ్ల మొక్కలను అడవుల్లో పెంచనున్నారు. ఆదిలాబాద్ హరితవనంలో రాశివనం ఏర్పా టు చేయగా త్వరలో స్మృతి వనం, ఔషధ వనం, రహదారి వనాలను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ విడతలో నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాటిన మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేయడంతో పాటు వాటి సంరక్షణ బా ధ్యతలను సైతం ఆయా శాఖల అధికారులు పర్యవేక్షిస్తారు.