సిఎ ఎన్నికల నిర్వహణలో భారత్ సాయం కోరతా: దహల్
ఖాట్మండు: రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో సాయం అందించాల్సిందిగా భారత్‌ను కోరతానని యుసిపిఎన్ (మావోయిస్టు) చైర్మన్ పుష్ప కమల్ దహల్ బుధతెలిపారు. వచ్చే వారంలో ఆయన భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. నేపాల్‌గంజ్‌లోని కొత్త రోడ్డు వద్ద జనాందోళన్-2 సమయంలో మృతిచెందరు. అమరవీరుడు సేతు బి.కె విగ్రహన్ని ఆవిష్కరించిన ఆయిన ఇక్కడ చేసిన ప్రసంగంలో పై విషయం తెలిపారు. రాజ్యాంగ నిర్బాయక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సన్నిహిత పొరుగుదేశంగా నేపాల్ చేయండి అని భారత ప్రభుత్వాని కోరతాను అని చెప్పారు. ఈ పర్యటనలో తాను ఆర్థిక అభివృది అంశాలపైన భారత్‌తో చర్చిస్తానని తెలిపారు. ఈ పర్యటనలో తాను ఆర్థిక అభివృద్ది అంశాలపైన భారత్‌తో చర్చిస్తానని తెలిపారు. చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చిన 15 రోజుల లోగానే దహల్ న్యూఢిల్లీకి రానున్నారు. చైనా పర్యటనలో ఆయన అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో చర్చల్లో తాను అభివృద్ది, వాణిజ్య అంశాలపై త్త్రెపాక్షిక సహకారం (నేపాల్-భారత్-చైనా) గురించి ప్రస్తావించినట్లు దహల్ తెలిపారు.