సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చైన్ స్నాచింగ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో బంగారు చైన్ లాక్కెళ్లాడు ఓ దొంగ. షేక్ పేటకు చెందిన యశోద, మల్లేష్ దంపతులు సికింద్రాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్లేందుకు రైలు ఎక్కుతుండగా … వెనకనుంచి వచ్చిన దొంగ …4 తులాల మంగళ సూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.