సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం
వరంగల్, జనంసాక్షి: కాజీపేట రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్ధలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. రైల్వే అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.