సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,జనవరి 3(జనంసాక్షి): హైదరాబాద్ మహానగరం ఇక సిగ్నల్ ఫ్రీ నగరంగా మారబోతుందని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో జపనీస్ పార్క్‌ను పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, రాజ్యసభసభ్యుడు కేకే, పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. రూ.20వేల కోట్లతో నగరంలో రవాణా అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య రూపుమాపేందుకు మల్టీలెవల్ ?ఫ్లెఓవర్‌లు, జంక్షన్లు ఏర్పాటు చేస్తున్నాం. వేసవిలో కరెంట్ కోతలు లేకుండా చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామన్నారు. కేంద్ర నుంచి అధిక నిధులు వచ్చేలా రాష్ట్ర బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ వచ్చిన తరువాత హైదరాబాద్ అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేశారని వెల్లడించారు.