సినీ హాస్యనటుడు అలీకి డాక్టరేట్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు ప్రేక్షకుల్ని గత మూడు దశాబ్దాలుగా నవ్వుల లోకంలో ముంచెత్తుతున్న ప్రముఖ హాస్య నటుడు అలీకి డాక్టరేట్‌ లభించింది. యూరోపియన్‌ యునైటెడ్‌ యూనివర్సిటీ అతనికి డాక్టరేట్‌ను ప్రధానం చేస్తుంది. ఈ నెల 25 న కోయంబత్తూరులో అలీ డాక్టరేట్‌ అందుకోనున్నాడు.