సిపిఎస్ రద్దు, 30 శాతం ఐ. ఆర్ లతో పాటు, ఉపాధ్యాయులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి -పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి భానోత్ రవి
టేకులపల్లి, ఆగస్టు 8( జనం సాక్షి ): సిపిఎస్ రద్దు, 30% ఐ.ఆర్ లతోపాటు ఉపాధ్యాయులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టి ఆర్ టి యు జిల్లా శాఖ పిలుపు మేరకు టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం నందు వివిధ సమస్యలతో కూడిన వినతపత్రాన్ని మంగళవారం తహశీల్దార్ కి అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవి మాట్లాడుతూ నూతన రాష్ట్రంలో ఉపాధ్యాయులకు శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం ఎన్నికలకు ముందే రద్దు చేయాలని, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న డి ఏ లు, పిఆర్సి ఏరియల్స్ తోపాటు, సాధ్యమైనంత త్వరగా పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసి, అది అమలు అయ్యేంతవరకు 30శాతం ఐఆర్ ప్రకటించాలని, వీటన్నిటితో పాటు ప్రభుత్వ ధరకు ఉపాధ్యాయులందరికీ జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పి .నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు టి . రవీందర్, రాష్ట్ర కార్యదర్శి విజయనిర్మల, జిల్లా కార్యదర్శి కె .ప్రసాద్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.మోతిలాల్, టి .సర్కార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బి .రమేష్ బాబు,బి . బాలాజీ ,జి లక్ష్మణ్, వేణుగోపాల్ రెడ్డి, బి .హరిప్రియ రాథోడ్,ఎస్.దస్రు, ఇ ఇస్తెరమ్మ, బి . బాలాజీ తదితరులు పాల్గొన్నారు.