సిపిఎస్ విధానం రద్దు చేయాలి

గరిడేపల్లి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి): పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పిఆర్టియుటీఎస్ గరిడేపల్లి మండల అధ్యక్షుడు మైనం ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి ఎర్ర కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో స్థానిక తహసిల్దార్ కి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, గోదేశి దయాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుందరి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల సైదులు, మహిళ ఉపాధ్యక్షురాలు సువర్ణ , మండల అసోసియేట్ అధ్యక్షుడు మేకల సందీప్ , మహిళా కార్యదర్శి అజీమ్ నజీమా తదితరులు పాల్గొన్నారు.