సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయుల నిరసన సెగలు..

కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి /గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిరసనలు చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….సెప్టెంబర్1 (2004)తర్వాత ఉద్యోగం లో చేరిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది.దీని వల్ల పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ పొందే హక్కు లేకుండా పోయింది,ఉద్యోగుల డబ్బులను స్టాక్ మార్కెట్ లో పెట్టి వచ్చిన డబ్బులను పెన్షన్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు తీవ్ర స్థాయి లో నష్టపోయే అవకాశం ఉందని అన్నారు.

సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు కోరుతూ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యమాలు చేస్తున్నారు.ఈ క్రమంలో సిపిఎస్ అమలు లో కి వచ్చిన సెప్టెంబర్ 1 న విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.సెప్టెంబర్ 1 విద్రోహ దినాన్ని పాటిస్తూ మండలంలోని అర్పణపల్లి, కేసముద్రం (స్టేషన్) ,మర్రి తండా,కాట్రపల్లి పాఠశాల ల్లో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగిందీ.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ భాద్యులు నర్సింహారాజు, చీకటి ఉపేందర్, మోహన కృష్ణ , వినోద్, వెంకన్న ,శ్రీనివాస్, రాధిక , కరుణ పాల్గొన్నారు.

తాజావార్తలు