సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గా పోకల వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గా త్రిపురం సుధాకర్ రెడ్డి ఎన్నిక

, జూలై 15 (జనం సాక్షి): జూలై  నెల 11,12 తేదీలలో కోదాడ లో జరిగిన సిపిఐ జిల్లా 3 వ మహాసభలలో గరిడేపల్లి మండలం కు చెందిన పోకల వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గా త్రిపురం సుధాకర్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరిని ఎన్నుకోవడం పట్ల సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, యడ్ల అంజిరెడ్డి, పోటు పూర్ణ చందరరావు, మామిడి శ్రీను, చేవ వెంకన్న, పందిరి నాగయ్య, వేశ్యల ఆంజనేయులు, ప్రతాని సైదులు, కుందూరు వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా పోకల వెంకటేశ్వర్లు, త్రిపురం సుధాకర్ రెడ్డి లు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి  సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు  కృతజ్ఞతలు తెలియజేస్తూ మండలంలో సిపిఐ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.
Attachments area