సిపిఐ బహిరంగ సభకు తరలిన కామ్రేడ్స్
ప్రజా, కార్మిక హక్కుల కోసం పోరాడేది ఎర్రజెండా
పల్లా దేవేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి
నల్గొండ. జనం సాక్షి
ప్రజా, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా ఆదివారం శంషాబాద్ లో జరుగుతున్న సీపీఐ బహిరంగ సభకు నల్లగొండ నుంచి కార్మికులు, పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా జెండా ఊపి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య హక్కులు పూర్తిగా హారించబడుతున్నాయని ఆర్థిక దోపిడి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు దేశ సంపదను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. బిజెపి కబంధహస్తాల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బిజెపి పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా తమ సొంత ప్రయోజనాల కోసం అధికారాలను ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలలొ భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ టౌన్ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు దోనకొండ వెంకటేశ్వర్లు, గుండె రవి ,రేవెల్లి యాదయ్య, జి నరేందర్, నరసింహ, నాగార్జున,హన్మంతు యాదయ్య, విశ్వనాధుల లెనిన్ , గిరి, నగేష్,తదితరులు పాల్గొన్నారు.