సిపిని కలిసిన కాశీబుగ్గ దసరా ఉత్సవ కమిటీ
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 29(జనం సాక్షి)
కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం వరంగల్ కమీషనర్ అఫ్ పోలీస్ డాక్టర్. తరుణ్ జోషి గారిని కలిసి కాశిబుగ్గ దసరా ఉత్సవాలు చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో జరిగే బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని దసరా ఉత్సవాలకు వచ్చే వెహికల్స్ కు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని కాశీబుగ్గ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని కోరినారు డాక్టర్. తరుణ్ జోషి మాట్లాడుతూ చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద జరిగే బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలకు కావలసిన పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో పాటు నేను కూడా దసరా ఉత్సవాలలో పాల్గొంటానాని తెలియజేసినారు. కార్యక్రమంలో కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు దూపం సంపత్. కన్వీనర్ బయ్య స్వామి. ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్. గుళ్ళపల్లి రాజ్ కుమార్. గుత్తికొండ నవీన్.ఓం ప్రకాష్ కొలారియా.మార్త ఆంజనేయులు. వలపదాసు గోపి. వేముల నాగరాజు. మార్టిన్ లూథర్. ములుక సురేష్. సిద్ధోజు శ్రీనివాస్. రామ యాదగిరి. కోట సతీష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|