సిబిఐ డైరెక్టర్‌ పదవీకాలాన్ని కుదించలేరు

సుప్రీంలో ఖర్గే పిటిషన్‌

న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌ పదవీ కాలాన్ని కుదించే అధికారం ఎవరికీ లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. చట్ట ప్రకారం సీబీఐ డైరెక్టర్‌ పదవీ కాలం

రెండేళ్ళని తెలిపారు. దీనిని తగ్గించకూడదన్నారు. ఆయన శనివారం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను కేంద్ర ప్రభుత్వం సెలవుపై పంపించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనను పూర్తి కాలం సీబీఐ డైరెక్టర్‌ పదవిలో కొనసాగించాలని కోరారు. కేంద్ర

ప్రభుత్వానికి కానీ, కేంద్ర నిఘా కమిషన్‌కు కానీ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను సెలవుపై పంపించే అధికారం లేదని ఖర్గే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్య చట్ట విరుద్ధమైనదని, నిరంకుశత్వంతో కూడినదని ఆరోపించారు.