సిమ్మెంటు బస్తాల మాయంపై విచారణ షురా!
ఖమ్మం సంక్షేమం: బయ్యారం మండలం గృహనిర్మాణశాఖ సిమ్మెంటు గోదాం నుంచి 268 బస్తాలు మాయం అవటంపై విచారణ నిర్వహించాలని, ఇందుకు బాధ్యులైన గోదాం ఇన్‌ఛార్జి చాట్ల వెంకటేశ్వర్లు నుంచి రూ. 47800 లను మూడు రోజుల్లో వసూలు చేయాలని జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు గత రెండేళ్ల కాలంలో సీఆర్వోలు లేకుండా 840 సిమెంటు బస్తాలు మాయమైన విషయంపై ఇల్లందు నియోజకవర్గ ప్రత్యేకాధికారి
విచారణ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.