సిమ్లాలో టూరిస్టుల ఇక్కట్లు

– అటల్‌ టన్నెల్‌ వద్ద చిక్కుకున్న పర్యాటకులు

– రక్షించిన హిమాచల్‌ పోలీసులు

సిమ్లా,జనవరి 3(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో గత అక్టోబర్‌లో రోహ్‌తంగ్‌ వద్ద ప్రారంభించిన అటల్‌ సొరంగ మార్గం సవిూపంలో 300 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. శనివారం ఉదయమే వీరు సొరంగ మార్గం దాటి వెళ్లి తిరిగి మనాలీ వస్తున్న క్రమంలో లా¬ల్‌ వద్ద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సొరంగం ద్వారా ప్రత్యేక వాహనాలను పంపించి వారిని రక్షించారు. ఈ వివరాలను కులు జిల్లా ఎస్పీ గౌరవ్‌ సింగ్‌ వెల్లడించారు. మొత్తం 70 వాహనాల్లో అక్కడికి చేరుకున్న క్విక్‌ రియాక్షన్‌ బృందం సహాయ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ అర్ధరాత్రి వరకు సాగిందన్నారు.ఇంకెవరైనా పర్యాటకులు మంచులో చిక్కుకున్నారేమోనన్న అనుమానంతో కులు డీఎస్పీ, ఎస్‌హెచ్‌వో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ చేపడుతున్నామని ఎస్పీ చెప్పారు. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న రెండుమూడు రోజుల్లో మంచు మరింత ఎక్కువగా కురిసే అవకాశముందని, అందువల్ల పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనవరి 8న దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంతం పొడవైన సొరంగ మార్గం అటల్‌ టన్నెల్‌ (9.2 కి.విూ)ను గత అక్టోబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి అది ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు.