సిరియాపై ఇజ్రాయిల్‌ దాడులు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): సిరియాపై ఇజ్రాయెల్‌ జెట్‌ యుద్ధ విమానాలు దాడి చేశాయి. సైనిక స్థావరంపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయినట్లు సిరియా బలగాలు తెలిపాయి. అయితే, అరబ్‌ విూడియా, అక్కడి హక్కుల సంస్థలు మాత్రం ఇజ్రాయెల్‌ జెట్‌ యుద్ధ విమానాలు సిరియాలోని రసాయన ఆయుధాలు ఉత్పత్తి చేసే స్థావరాన్ని లక్ష్యంగా దాడి చేశాయని, వీటి భద్రతను సిరియా సేనలే చూస్తున్నాయని అభిప్రాయపడ్డాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై ఇజ్రాయెల్‌ ప్రతినిధులను ప్రశ్నించే ప్రయత్నం చేసినా వారు నిరాకరించారు. మరోపక్క, లెబనాన్‌ విూడియా ఇజ్రాయెల్‌ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లెబనాన్‌ ఎయిర్‌స్పేస్‌ నిబంధనలు ఆ దేశం ఉల్లంఘించిందంటూ వ్యాఖ్యానించింది. లెబనాన్‌ గగనతలం గుండా ప్రయాణించే సిరియాలోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు దాడి చేశాయి.