సిరిసిల్లను కాదని వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కా…?

-సిరిసిల్ల అభివృద్దిని పక్కన పెట్టిన సర్కార్‌

-మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌

రాజన్నసిరిసిల్ల, అక్టోబర్‌ 23 (జ‌నంసాక్షి): తెలంగాణా ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 50శాతంకుపైగా పవర్‌లూంలున్న ప్రాంతం సిరిసిల్ల ప్రాంతమని, మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను సిరిసిల్లలో కాకుండా వరంగల్‌లో నిర్మించడం నిజంగా సిరిసిల్లకు చీకటి దినంగా మిగిలిపోకతప్పదని మాజీ ఎంపి టీపీసీసీ ఉపాద్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఈ ఈపాపం ఊరికేపోదని సిరిసిల్ల నేతన్నల ఉసురుతాకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌లు మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎంపి పొన్నం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిరిసిల్లలో ఆయన విూడియా మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం మొత్తం విూద 49వేల పవర్‌ లూం మిల్లులున్నాయని, ఇందులో 30వేల మిల్లులు సిరిసిల్లలోనే ఉన్నాయని, రెండో అతిపెద్ద వస్త్ర పరిశ్రమగా దేశంలోనే సుస్తిర స్థానాన్ని సొంతం చేసుకున్న సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ నిర్మించ కుండా వరంగల్‌కు తరలించుకుపోవడం సిరిసిల్లకు అన్యాయం చేయడం కాదాఅన్నారు. ముఖ్యమంత్రిని ఎంపిగా మూడు సార్లు, ఆయన కుమారుడు కేటీఆర్‌ను నాలుగుసార్లు అసెంబ్లీకి పంపించిన నేతన్నల పట్టణం సిరిసిల్లను ప్రక్కన పెడుతూ దశానికే తలమానికంగా వరంగల్‌లో ఏర్పాటు చేయడం వెనుక దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం హాయంలో జరుగుతున్న అన్యాయానికి పరాకాష్టగా ఇది చెప్పక తప్పదన్నారు. మూడున్నరేల్లలో చేయని అభివృద్ది పనులు వచ్చే ఏడాదిన్నరలో చేసే అవకాశం లేదని సిరిసిల్ల విూద ఎందుకు సీతకన్ను అని టీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. నిదులు నియామకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణా ఉద్యమానికి అడ్డుతగిలి తెలంగాణా విభజన జరిగితే దేశవిభజన జరుగుతుందన్న ఆంద్రావారితో ముక్యమంత్రి కేసీఆర్‌ అంటకాగడం ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. వరంగల్‌ కాకతీయ మెగా క్లస్ట్‌న్రు గుంటూర్‌కు చెందిన రాంకీ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌కు చెందిన ఆయోద్య రామిరెడ్డికి అప్పచె ప్పడం వెనుక మతలబేంటి అని ఈవిషయంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని పొన్నం డిమాండ్‌ చేశారు. మూడుసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిచిన ప్రజలకు తనచర్మంతో చప్పులుకుట్టిస్తానన్న కేసీఆర్‌ జిల్లాను ముక్కలు ముక్కలుచేసి ఆవిదంగా రుణం తీర్చుకున్నా ర ని పొన్నం ఎద్దేవా చేశారు. ప్రతి చిన్న విషయానికి ట్విట్టర్‌లో స్పందించే తమ్ముడు కేటీఆర్‌ సిరిసిల్లకు జరిగిన అన్యాయంపై ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. సమావేశంలో సంగీతం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.