సిరోల్ నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన

-జిల్లా కలెక్టర్ శశాంక -ఎమ్మెల్యే రెడ్యా నాయక్
-ఎంపీ కవితమ్మ

జన సంద్రంగా సీరోల్ మండల కేంద్రము.

సీరోల్ అక్టోబర్ 17 (జనం సాక్షి న్యూస్)

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రము లో రెవెన్యూ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభ్యులు డియస్ రెడ్యానాయక్,మాళోత్ కవితమ్మ, మహబుబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక కి ఘన స్వాగతం పలికారు.. నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు డియస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు హంస లాంటి వారు..పాలలాంటి నియోజకవర్గం లో నీరులాంటి ఉద్దెర నాయకులు చేరినా పాలని ,నీళ్ళని వేరుచేసి
నా నాయకత్వాన్ని విశ్వసించి గెలిపించిన ప్రజలు జోడించి నమస్కరిస్తున్నా..
ప్రజల్లో విశ్వసనీయత లేని నాయకునికి మనుగడ ఉండదు. .. మనుగడలేని నాయకులకు ప్రజాక్షేత్రంలో స్థానం లేదు …..
సీనియర్ నాయకులు , మాజీ ఎంఎల్సీ వెడవెల్లి వెంట్ రెడ్డి ప్రసంగిస్తూ ఈ నియోజకవర్గం లో ఓడినా గెలిచినా,రెడ్యానాయక్ చేసిన అభివృద్ధి తప్ప మరే నాయకులు చేయలేదన్నారు..వారికి మా ఆశీస్సులు ఎళ్ళవేళల ఉంటాయన్నారు..
మాళోత్ కవితమ్మ ప్రసంగిస్తూ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మండల ఏర్పాటు ప్రజలకు మరింత అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ సాధ్యమవుతుందన్నారు.ఇంత వయస్సు లో తన ఆరోగ్య పరిస్థితిని సైతం లెక్కచేయకుండా యువకుని వలె ప్రజలకు సేవ చేయాలనే తపన తప్ప మరో ధ్యాస లేదు.. ఉచ్ఛ్వాస,నిశ్చ్వాసలు నియోజకవర్గ అభివృద్ధి కే అంకితమిచ్చాడు.10శాతం, రిజర్వేషన్ ఇచ్చి,తండాలను పంచాయతీ లు చేసిన కెసిఆర్ వెంట,.మీ చిరకాల వాంఛ ను నెరవేర్చిన అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు రెడ్యానాయక్, కెసిఆర్ వెంటే నడుస్తామని మాటివ్వాలని, చేతులెత్తి జేజేలు పలికాలన్నారు..అలా అనగానే కరతాళ ధ్వనులతో జై తెలంగాణ, జై కెసిఆర్, జై రెడ్యానాయక్ అంటూ నినదించారు..
యువనేత రవిచంద్ర మాట్లాడుతూ సీరోల్ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ,డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు కోరిన కోరికలు రెడ్యానాయక్ అనుకుంటే ఏదైనా సాధిస్తారు.ఇది ప్రజల్లో ఉండే ప్రగాఢ విశ్వాసం…వారి నమ్మకమే రెడ్యానాయక్ కి వెయ్యేనుగుల బలం..మా యువత మీ అడుగు జాడల్లో అడుగేస్తూ అనునిత్యం మిమ్మల్ని అనుసరిస్తుంది..
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి ప్రసంగిస్తూ రెడ్యానాయక్ కాళేశ్వర జలాలతో నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకున్నారన్నారు. మునుపే ముందుచూపుతో సీరోల్ గ్రామాన్ని మండలస్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలకల్పించి అభివృద్ధి చేశారు.
జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చి రెడ్డి ప్రసంగిస్తూ మన అధినాయకుడు చేసింది చేస్తున్నది చర్చించుకోవడం, చెప్పుకోవడం గర్వకారణం అంటూ దాని గురించి శ్రీశైలం రాసిన వచన కవిత్వం రూపంలో ఉన్న సందేశాన్ని అక్షరాలను అణ్వాయుధాలుగా మలిచి సంధిస్తూ సాగిన భారాస యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవినాయక్ ప్రసంగం.
సీరోల్
యంపిటిసి భోజ్యనాయక్ హైదరాబాద్ లో తన ని యంపిటిసి టికెట్ ఇచ్చి , ప్రజాప్రతినిధిని చేసిన ఘనత రెడ్యానాయక్ దే.ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీని,ప్రజల చిరకాల వాంఛ ను నెరవేర్చిన ఘనత రెడ్యానాయక్ గారిదేనన్నారు. సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ శ్యామల రంగమ్మ గారు మాట్లాడుతూ రెడ్యానాయక్ కి రుణ పడి ఉంటాం.. అందరూ అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్,కురవి,సీరోల్ మండల యంపిపి గుగులోత్ పద్మావతి రవినాయక్,డోర్నకల్ యంపిపి బాలు,జెడ్పీ టీసీ కమల రామనాథం,వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్యయాదవ్,pacs,fscs చైర్మన్ దొడ్డ గోవర్థన్ రెడ్డి, కొండపల్లి శ్రీదేవి,మున్సిపల్ చైర్మన్ వాంక్ డోత్ వీరన్న,కోటిలింగాల, డోర్నకల్ మండల పార్టీ అధ్యక్షులు నున్న రమణ,గాడిపల్లి రాములు,విద్యాసాగర్,తోట రమేష్, పెద్ది వెంకన్న అన్ని గ్రామాల సర్పంచులు, యంపిటిసి లు, అధికారులు, ప్రజాప్రతినిధులు,పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.