సిర్పూరు మిల్లు తెరిపించేందుకు కృషి

ASSEMBLY-ktr1హైదరాబాద్‌: యాజమాన్యం మారిన తర్వాతే సిర్పూరు పేపర్‌ మిల్లు ఇబ్బందులు ఎదుర్కొని మూతపడిందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన నేడు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాట్లాడుతూ సిర్పూరు పేపర్‌ మిల్లు కొత్త యాజమాన్యం పట్టించుకోక పోవడంతో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. తాము యాజమాన్యమైన పోద్దార్లతో కూడా మాట్లాడామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి లబ్ధిపొందాలని కంపెనీ యాజమాన్యం ప్రయత్నించిందని అన్నారు. తాము ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మిల్లు మూతపడిందని చెప్పారు. ప్రశ్రమపై ఆధారపడిన 3వేల మంది కార్మికులను ఆదుకుంటామని అన్నారు. మిల్లును తెరిపించేందుకు బ్యాంకర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.