సిర్పూర్ పేపర్ మిల్లు పున:ప్రారంభానికి చర్యలు
నూతన యాజమాన్యంతో సర్కారు చర్చలు
హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి):
ఆదిలాబాద్ జిలా ్లలోని సిర్పూర్ పేపర్ మిల్లు పునఃప్రా రంభంపై తెలం గాణ ప్రభుత్వం దృష్టి సారించింది. పాత యాజమాన్యం మిల్లును తెరిచేందుకు ఆసక్తి కనబ ర్చకపోవడంతో కొత్త యాజమాన్యానికి అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై శుక్రవారం మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పేపర్ మిల్లును తెరిచేందుకు అవసరమైన రాయితీలు, ప్రస్తుతం మిల్లు తెరిచేందుకు ఉన్న సమ స్యలపై చర్చించారు. కొత్త యాజమాన్యాలు ఎలాంటి రాయితీలు కోరుతున్నాయన్న విషయం ప్రస్తావనకు వ చ్చింది. దీనిపై ఈనెల 24వ తేదీన మరోమారు చర్చించాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.