సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై మిలిటెంట్ల మెరుపుదాడి

ఐదుగురు జవాన్ల హతం
ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్ల మృతి
న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి):
శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై ఉగ్రవా దులు మెరుపుదాడి చేశారు. విచక్షణా రహి తంగా కాల్పు లు జరిపి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టు కున్నా రు. అప్రమత్తమైన భద్రతా బలగాలు వీరోచితంగా పోరాడి ఇద్దురు ఉగ్రవాదులను మట్టు బెట్టాయి. బుధవారం ఉదయం కాశ్మీర్‌లోయలోని శ్రీనగర్‌ బెమి నాలో ఓ పాఠశాలకు సవిూపంలో ఉన్న సీఆర్పీఎఫ్‌ బేస్‌ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. కనబడిన పోలీసులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమ త్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ¬రా¬రీగా జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆత్మాహుతి దళ సభ్యులు ఇద్దరు ఈ దాడికి తెగబడ్డారని సీఆర్పీఎఫ్‌ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల దాడుల్లో ఏడుగురు గాయపడ్డారని చెప్పారు. వారిని స్థానిక మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందÛ జళిస్తున్నారు. క్యాంప్‌కు సవిూపంలోని పాఠశాల విద్యార్థులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. మూడేళ్ల తర్వాత ముష్కర మూకలు కాశ్మీర్‌లో దాడులకు పాల్పడడం ఇదే తొలిసారి. 2010 జనవరిలో రద్దీగా ఉండే లాల్‌చౌక్‌లో ఉగ్రవాదులు దాడి చేశారు. రంగంలోకి దిగిన భద్రతాబలగాలు దాదాపు 48 గంటల పాటు పోరాడి తీవ్రవాదులను మట్టుబెట్టాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు, మరో ఐదుగురు ఇతరులు మృత్