సీఎం కేసీఆర్‌తో శరద్ పవార్ భేటీ
హైదరాబాద్,జనవరి12(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. శరద్ పవార్ కు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవార్ ను సీఎం శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సీఎంను పవార్ కలిసిన సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, కవిత ఉన్నారు. అయితే ప్రత్యేకంగా పవార్ రావడంపై కారణాలు తెలియరాలేదు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన రాకలో ఆంతర్యం తెలియాల్సి ఉంది. ఇటీవల సిఎం చండీయాగం నిర్వహించినప్పుడు కూడా పవార్ హాజరైన విషయం తెలిసిందే.