సీఎం కేసీఆర్‌ ని కలిసిన సింధు

 

హైదరాబాద్‌,ఆగస్టు30: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో సింధు మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. బుధవారం సీఎం కేసీఆర్‌ ను పీవీ సింధు కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ రజత పతకం సాధించిన సింధుని సీఎం అభినందించారు. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించి దేశ ప్రతిష్టను పెంచాలని సింధుకు సీఎం సూచించారు.