సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఓయూ విద్యార్థుల యత్నం
హైదరాబాద్, అక్టోబర్8(జనంసాక్షి):
విశ్వవిద్యాలయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం భారీ ఆందోళన చేపట్టారు. ప్లపకార్డుల చేతబూని నినాదాలు చేశారు. ఈ సమయంలో విద్యార్థులంతా క్యాంపు కార్యాలయం వైపు దూసుకొచ్చేందుకు యత్నించారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
విద్యార్థులకు పోలీసులకు కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు విద్యార్థులు ఓయూ క్యాంపస్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి గన్‌పార్క్‌కు చేరుకున్నారు. యూనివర్సిటీలకు విసిలను నియమించాలని, అకడిమక్ ఖాళీలను భర్తీ
చేయాలని, హాస్టళ్లను మెరుగుపర్చాలని, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్సిసి వద్ద వీరిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. చివరకు వీరు గన్‌పార్క్ వద్దకు చేరుకుని
అక్కడి నుంచి సిఎం క్యాంపు కార్యాలయానికి దూసుకుని వచ్చారు. సిఎం కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.