సీఎం ఢిల్లీ పర్యటన సాధారనమే:శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సీఎంను మారుస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్‌ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటన సాధారణమేనన్నారు. ఈ పర్యటన కారణంగా ఈ నెల 6,7,8తేదీల్లో అనంతపురం జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు శైలజానాథ్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రితో రఘువీరారెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంచేశారు.