సీఎం పనితీరే గెలిపిస్తుంది
– గ్రేటర్‌పై కవిత ధీమా
హైదరాబాద్,జనవరి27(జనంసాక్షి):హైదరాబాద్ నగర ప్రజల విశ్వాసమే టిఆర్‌ఎస్ గెలుపునకు దోహదపడుతుందని టిఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌తో పాటు ఈ ప్రాంత ప్రజలకు సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్‌ను గెలిపించాలన్న విశ్వాసంతో ఉన్నారని అన్నారు. అలాగే ఇక్కడ అభివృద్ధికి బిజెపి చేసిందేవిూ లేదని హైదరాబాద్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విూట్ ద ప్రెస్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అవకాశవాదులను ప్రజలు తరిమికొట్టాలన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50శాతం డివిజన్లు మహిళలకు కేటాయించడం కేసీఆర్ గొప్పతనమని కొనియాడారు. మహిళలు పదవుల్లో ఉన్నచోట అవినీతి తక్కువగా ఉంటుందని…అందువల్ల హైదరాబాద్ మేయర్‌గా మహిళ కావాలని తాను కోరుకుంటున్నట్లు కవిత పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా హైదరాబాదీలే అని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలందరూ సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్‌కు మద్ధతిచ్చి… హైదరాబాద్ అభివృద్ధికి సహకరించండి. కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వ పాలన ఉంది. అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నాం. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడిగే రాజకీయ పార్టీలను ప్రజలు బహిష్కరించాలని కవిత పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ మత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారందరూ తమవాళ్లేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ సమదృష్టితో చూస్తున్నారని, ఎటువంటి వివక్ష చూపించడం లేదని తెలిపారు. ‘మన నగరం.. మన పార్టీ’ తమ నినాదం అన్నారు. టీఆర్‌ఎస్ ఎప్పటికీ ప్రజల పార్టీయేనని స్పష్టం చేశారు. లోకం తెలియని నారా లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘కారు’లో ప్లేస్ ఉన్న కారణంగానే చాలా మంది నాయకులు ‘సైకిల్’ వదిలి తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కవిత దీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీలో అవకాశవాదులను ప్రజలు బహిష్కరించాలని సూచించారు. విూట్ ది ప్రెస్‌లో కవిత మాట్లాడారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకుంటాం. ఎలా రాబట్టుకోవాలో తమకు తెలుసు. ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌పై దుష్పచ్రారం చేస్తున్నాయి. అవకాశవాదులను ప్రజలు బహిష్కరించాలి. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ చేసిందేమి లేదని అన్నారు. జీహెచ్‌ఎంసీలో బీజేపీకి హైవోల్టేజ్ షాకివ్వాలి. మతత్తత్వ శక్తులకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాలి. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదు. ప్యాకేజీ.. లీకేజీ అంటూ వెంకయ్యనాయుడు ప్రాస కోసం పాకులాడుతున్నారే తప్ప తెలంగాణ ఇచ్చింది ఏవిూ లేదన్నారు. ఎన్నికలప్పుడు ప్యాకేజీలు అంటూ మోసం చేయడం బీజేపీకి అలవాటు. హైదరాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని, అందుకే గ్రేటర్‌లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో కరెంట్, నీటి బకాయిలు మాఫీ చేశాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చైతన్య పరుస్తున్నాం. హైటెక్ సిటీ ఒక్కటే అభివృద్ధికి చిహ్నం కాదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 18నెలల్లోనే 190 అభివృద్ధి పనులు చేసి చూపించిందని కవిత చెప్పారు. మూడు నెలల్లోనే 24గంటల విద్యుత్ సరఫరాకు కృషిచేసిందని అన్నారు. సీఎం కేసీఆర్ చేసేదే చెప్తాడని, చెప్పింది పక్కాగా చేసి చూపిస్తారన్నారు. వచ్చే రెండేళ్లలో 24గంటల పాటు ప్రతి ఇంటికి తాగునీరును అందిస్తామన్నారు. అందుకోసం సీఎం ఇప్పటకే నగరానికి ఉత్తరాన ఒక రిజర్వాయర్, దక్షిణాన ఒక రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారని, పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. నగర జనాభాను దృష్టిలో పెట్టుకునే అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు నగరంలోని తాగునీరు, డ్రైనేజి, విద్యుత్, రోడ్ల సమస్యలను పట్టించుకోలేదని, ఫలితంగా ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుంటే కొత్త కోడల్ని అత్త అది బాగలేదు, ఇది బాగలేదు, అది సరిగ చేస్తలేవు ఇది చేస్తలేవని వేధించినట్లు ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి అని అన్నారు. 60 ఏండ్లు సంసారం చేసిన అత్త చేయని పనులు 18నెలల్లో కొత్త కోడలు ఎలా చేస్తుందన్నారు. కేసీఆర్ సర్కార్ సంపన్నులు నివసించే ఇండ్లలెక్క అన్ని హంగులతో ఒక్కో ఇంటికి రూ.7లక్షలు వెచ్చించి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నదన్నారు. నగరంలో భూ సమస్య కారణంగా 9 అంతస్తుల భవనాలను నిర్మిస్తుందని, వాటిలో లిఫ్ట్‌లను కూడా ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో మొత్తం లక్ష ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ ఇండ్లు ప్రతి నిరుపేదకు పారదర్శకంగా అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రేటర్‌ను ఆదర్శ, హరిత నగరంగా మర్చేందుకు కృషి చేస్తున్నామని ఇందుకోసం 2 కోట్ల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో 50శాతం టిక్కెట్లను కేసీఆర్ మహిళలకు కేటాయించి, స్త్రీలపై ఆయనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. డివిజన్‌లు మరింత
అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటువేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు క్రాంతి, పల్లె రవి కుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.