సీఎం బస చేసిన అతిథిగృహం ముట్టడికి సీపీఎం యత్నం
ఖమ్మం: జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కూమర్‌రెడ్డి బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిధిగృహం ముట్టడికి సీపీఎం కార్యకర్తలు యత్నించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ అతిధిగృహం సమీపంలోకి దూసుకువచ్చారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.