సీఎం భజన ఆపండి.. తెలగాణ ప్రయోజనాలను కాపాడండి
పాల్వాయి గోవర్థన్
హైద్రాబాద్,జూలై 3(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి భజన మానాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిస్తుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి భజన చేస్తున్నారని, నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నాడని, నాగార్జునసాగర్ నీటి మట్టం 510 అడుగులకు తగ్గితే హైద్రాబాద్‌కు నీరివ్వడం కష్టమనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉన్నదని, తాను ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన తర్వాత మంచినీరు, సాగునీటి కోసం ఉద్యమిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఉన్నదనీ, దీనిపై సోనియా,రాహుల్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని సీయం చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.